Homeటాప్ స్టోరీస్'సరా సరి'.. భీష్మ నుండి మరో హిట్ సాంగ్

‘సరా సరి’.. భీష్మ నుండి మరో హిట్ సాంగ్

'సరా సరి'.. భీష్మ నుండి మరో హిట్ సాంగ్
‘సరా సరి’.. భీష్మ నుండి మరో హిట్ సాంగ్

నితిన్ కు హిట్ వచ్చి చాలా కాలమైంది. తను నటించిన గత మూడు సినిమాలు ప్లాప్ కావడంతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడ్డాడు. అయితే బౌన్స్ బ్యాక్ అవ్వడానికి భీష్మ సరైన సినిమాగా భావిస్తున్నాడు. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. ఛలో సినిమాతో అందరినీ అలరించిన ఈ దర్శకుడి రెండో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అదే సమయంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటివరకూ వచ్చిన ప్రోమోలు, పాటలు సినిమాపై అంచనాలను పెంచుతూనే ఉన్నాయి.

ఈ సినిమా నుండి విడుదలైన సింగిల్స్ యాంతెం ఇప్పటికే ఎంత పెద్ద హిట్ అయిందో మనందరం చూసాం. పాట విడుదలైన దగ్గరనుండి ఎక్కడచూసినా ఈ సాంగ్ మార్మోగిపోతోంది. ఇప్పటికే ఈ పాట 6 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది. ఇక భీష్మ నుండి రెండు రోజుల క్రితం విడుదలైన సరా సరి సాంగ్ కూడా శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. మహతి స్వర సాగర్ అందించిన బాణీ అదిరిపోయింది. ఆహ్లాదకరమైన మెలోడీగా ఈ పాట నిలుస్తోంది. అలాగే శ్రీమణి అందించిన సాహిత్యం చాలా సింపుల్ గా, ఇట్టే నోటికి వచ్చేటట్టుగా ఉంది. అలాగే ఇప్పుడు హాట్ ఫామ్ లో ఉన్న అనురాగ్ కులకర్ణి ఈ పాటను అద్భుతంగా పాడాడు. “సరాసరి గుండెల్లో దించావే.. మరీ మరి మైకంలో ముంచావే” అన్న హుక్ లైన్ పాటకు ప్లస్ గా మారింది. మొత్తంగా భీష్మ నుండి మరో పాట కూడా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ దాటింది ఈ సాంగ్.

- Advertisement -

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలకు సన్నద్ధమవుతోంది. మరి ఈ సినిమాతో నితిన్ మళ్ళీ హిట్ ట్రాక్ పట్టాలని ఆశిద్దాం.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All