Homeటాప్ స్టోరీస్యూఎస్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన భీమ్లా నాయక్

యూఎస్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన భీమ్లా నాయక్

భీమ్లా నాయక్ హావ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఏమాత్రం తగ్గడం లేదు. సినిమా విడుదలై ఆరు రోజులు కావొస్తున్నా యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. భీమ్లా నాయక్ మూవీ తో పవన్ కళ్యాణ్ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపితమైంది. ఇదిలా ఉంటె తాజాగా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

- Advertisement -

ప్రస్తుతం యూఎస్‌లో భీమ్లా నాయక్ 250కి పైగా థియేటర్లలో రోజుకు 750 షోలు ప్రదర్శించబడుతున్నాయి. ఇప్పటివరకు 2.25 మిలియన్ డాలర్స్ వసూలు చేసి.. అంతకుముందు పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్ చేసాడు. అంతేకాదు యూఎస్‌లో ఆల్ టైమ్ తెలుగు హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన చిత్రాల జాబితాలో భీమ్లా నాయక్ 15వ స్థానంలో నిలిచాడు. ప్రీమియ‌ర్ షోస్ ద్వారానే 875,292 డాల‌ర్స్‌ రాబట్టిన భీమ్లా నాయక్..ఐదు రోజుల్లో 2.25 మిలియన్ డాలర్స్ అనగా 17.13 కోట్లు రాబట్టి వార్తల్లో నిలిచాడు. మర్చి 11 వరకు మరో పెద్ద సినిమా లేకపోవడం తో యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద భీమ్లా సందడి అలాగే నడుస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All