Homeటాప్ స్టోరీస్ఓ రోజు ముందే డిస్నీ ప్లస్ స్టార్ లో భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ కాబోతుంది

ఓ రోజు ముందే డిస్నీ ప్లస్ స్టార్ లో భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ కాబోతుంది

Bheemla Nayak premieres a day before on OTT
Bheemla Nayak premieres a day before on OTT

పవర్ స్టార్ ఓటిటి లో తన పవర్ చూపించడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. రానా తో కలిసి నటించిన భీమ్లా నాయక్ మూవీ ఒకేసారి రెండు ఓటిటి సంస్థలలో స్ట్రీమింగ్ కాబోతుంది. భీమ్లా నాయక్ చిత్రాన్ని ఆహా తో పాటు డిస్నీ హాట్ స్టార్ లు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 25 న ఒకేసారి ఈ రెండు సంస్థలలో భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. కానీ ఇప్పుడు డిస్నీ ప్లస్ స్టార్ లో ఓ రోజు ముందే స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపి సంతోషం నింపారు. మార్చి 24 నే స్ట్రీమింగ్ కాబోతుందని అధికారిక ప్రకటన చేసారు. అయితే ఆహా లో మాత్రం ముందు చెప్పినట్లు మార్చి 25 న స్ట్రీమింగ్ కాబోతుంది.

మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. పవన్ కళ్యాణ్, రానా ద‌గ్గుబాటి హీరోలుగా.. నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts