Homeగాసిప్స్ఆర్ఆర్ఆర్ కు పోటీగా భీమ్లా నాయక్ రిలీజ్

ఆర్ఆర్ఆర్ కు పోటీగా భీమ్లా నాయక్ రిలీజ్

bheemla nayak ott release date
bheemla nayak ott release date

టైటిల్ చూసి అదేంటి అనుకుంటున్నారా..? భీమ్లా నాయక్ గత వారమే విడుదలైంది కదా..మళ్లీ రిలీజ్ అవ్వడం ఏంటి..అది కూడా ఆర్ఆర్ఆర్ కు పోటీగా అని అనుకుంటున్నారా..ఇది నిజమే కాకపోతే వెండితెర ఫై కాదు ఓటిటి స్ట్రీమింగ్ లో భీమ్లా నాయక్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ , రానా కలయికలో మాస్ ఎంటర్టైనర్ గా ఫిబ్రవరి 25 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలైన చిత్రం భీమ్లా నాయక్.

సాగర్ కె చంద్ర డైరెక్షన్లో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించగా ..థమన్ మ్యూజిక్ అందించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను భారీ ధర కు డిస్ని హాట్ స్టార్ అండ్ ఆహా సంస్థలు దక్కించుకున్నాయి. ముందుగా డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయినా తర్వాత ఆహా లో స్ట్రీమ్ కానుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మార్చి 25 నుండి డిస్ని హాట్ స్టార్ లో భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. అదే రోజున వెండితెర ఫై ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాబోతుంది. ఇలా ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్నమాట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All