Homeటాప్ స్టోరీస్హిందీ లో వాయిదా పడ్డ భీమ్లా నాయక్

హిందీ లో వాయిదా పడ్డ భీమ్లా నాయక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా కలయికలో వచ్చిన భీమ్లా నాయక్ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా మాస్ ఎంటర్టైనర్ అని , చాల ఏళ్ల తర్వాత పవన్ నుండి అసలు సిసలైన యాక్షన్ చూశామని గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాగే కలెక్షన్స్ సైతం రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి.

- Advertisement -

కాగా ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు హిందీ లో ఒకేసారి రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ ఇప్పుడు వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ B4U భీమ్లా నాయక్ యొక్క డబ్బింగ్ వర్షన్ హక్కులు భారీ రేటుకు దక్కించుకుంది. భీమ్లా నాయక్ హిందీ వెర్షన్ కూడా తెలుగు వెర్షన్ పాటు విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు.

నార్త్‌లో విడుదలై హిందీ ప్రేక్షకులను కూడా అలరిస్తుందని భావించారు. అయితే నిర్మాణానంతర కార్యక్రమాల్లో జాప్యం జరుగుతుండటంతో హిందీ విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం యొక్క తెలుగు డిజిటల్ హక్కులు OTT దిగ్గజం ఆహా మరియు డిస్నీ+హాట్‌స్టార్‌లకు రికార్డ్ ధరకు విక్రయించబడ్డాయి. విడుదలైన 50 రోజుల తర్వాత ఈ సినిమా OTT ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All