Homeటాప్ స్టోరీస్అమెజాన్ కు కలిసొస్తున్న భీమ్లా నాయక్

అమెజాన్ కు కలిసొస్తున్న భీమ్లా నాయక్

Bheemla-Nayak-helping-Amazon-Prime-Video

పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపించడానికి రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొద్దీ నెలలుగా యావత్ సినీ లోకం , అభిమానులు ఎదురుచూస్తున్న బీమ్లా నాయక్ ..మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం తో అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రానికి సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేయగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ కు బాగా కలిసొస్తుంది.

- Advertisement -

‘భీమ్లా నాయక్’ మూవీ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్ స్టార్ మరియు ఆహా వీడియో ఓటీటీలు భారీ ధరకు దక్కించుకుంది. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ భాగస్వామి కాని అమెజాన్ ప్రైమ్ కు పవన్ సినిమా కలిసొస్తుంది. అదేలా అంటే మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కిందనే విషయం తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. భీమ్లా కోసం ఎదురుచూస్తున్న వారందరూ ఇప్పుడు మాతృకను చూడటం ప్రారంభించారు. ఆలా అమెజాన్ కు భీమ్లా నాయక్ బాగా కలిసొస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All