Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

భీమ్లా నాయక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

bheemla nayak first week collections
bheemla nayak first week collections

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రివేంజ్ డ్రామాగా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించడం విశేషం. ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా . సముద్రఖని , రావు రమేష్ , మురళి శర్మ లు ముఖ్యపాత్రల్లో నటించారు.

మొదటిరోజు మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మొదటి మూడు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద హౌస్ ఫుల్ కలెక్షన్ల తో కుమ్మేసింది. నాల్గో రోజు కాస్త తగ్గినా ఐదో రోజు వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఏడో రోజు మాత్రం అన్ని చోట్ల కలెక్షన్లు భారీగా తగ్గాయి.

- Advertisement -

7 వ రోజు కలెక్షన్లు చూస్తే..

నైజాంలో రూ. 40 లక్షలు
సీడెడ్‌లో రూ. 20 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు
ఈస్ట్‌లో రూ. 7 లక్షలు
వెస్ట్‌లో రూ. 5 లక్షలు
గుంటూరులో రూ. 6 లక్షలు
కృష్ణాలో రూ. 5 లక్షలు
నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి గురువారం రూ. 98 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఇక ఫస్ట్ వీక్ మొత్తం చూస్తే..

నైజాంలో రూ. 33.22 కోట్లు
సీడెడ్‌లో రూ. 10.09 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 6.91 కోట్లు
ఈస్ట్‌లో రూ. 5.02 కోట్లు
వెస్ట్‌లో రూ. 4.63 కోట్లు
గుంటూరులో రూ. 4.82 కోట్లు
కృష్ణాలో రూ. 3.38 కోట్లు
నెల్లూరులో రూ. 2.33 కోట్లతో కలిపి రూ. 70.40 కోట్లు షేర్, రూ. 106.90 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.55 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 89.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 146 కోట్ల గ్రాస్ రాబట్టింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All