
భీమ్లా నాయక్ ఫైనల్ కలెక్షన్స్ వచ్చాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చి..బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫైనల్ గా మాత్రం నష్టాలే మిగిల్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా మురళి శర్మ , సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించారు. ఫిబ్రవరి 25 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ..ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. కానీ ఫుల్ రన్‌లో కేవలం రూ. 97.63 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మరో రూ. 10.37 కోట్లు వసూలు చేసి ఉంటె సరిపోయేది కానీ అవి రాబట్టలేకపోవడం తో రూ. 10 కోట్ల పైగా నష్టాలను చవిచూసింది. ఈ నష్టం కూడా వచ్చేది కాదు కానీ ఏపీ లో టికెట్ ధర తక్కువగా ఉండడం..ఆ తర్వాత రాధే శ్యామ్ కోసం భీమ్లా థియేటర్స్ వెళ్లిపోవడం తో రూ.10 కోట్ల నష్టం వచ్చింది. ప్రస్తుతం ఈరోజు భీమ్లా నాయక్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహాలో స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది.