Homeటాప్ స్టోరీస్షాక్ : ఒకేసారి భారీగా పడిపోయిన భీమ్లా నాయక్ కలెక్షన్స్

షాక్ : ఒకేసారి భారీగా పడిపోయిన భీమ్లా నాయక్ కలెక్షన్స్

bheemla Nayak first day collections

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి భీమ్లా నాయక్ తో తన సత్తా ఏంటో చూపించారు. ఫస్ట్ డే నే పలు రికార్డ్స్ కొల్లగొట్టిన పవన్..వరుసగా మూడు రోజుల పాటు హావ చూపించి..సోమవారం మాత్రం డీలా పడ్డాడు. నాల్గో రోజు సోమవారం చాల చోట్ల కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి.

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోషియం సినిమాను తెలుగులో ‘భీమ్లా నాయక్’ పేరుతో ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వచించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణ చేయడమే కాక స్క్రీన్ ప్లే సహా మాటలు అందించడం విశేషం. ఇక థమన్ సంగీతం సినిమా ఫై మరింత అంచనాలు పెంచేసింది. ఇక భారీ ఎత్తున రిలీజ్ అయినా ఈ మూవీ అంచనాలు అందుకోవడం లో సక్సెస్ సాధించింది.

- Advertisement -

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే..మొదటి మూడు రోజులు హౌస్ ఫుల్ గా రన్ అయినా భీమ్లా..నాల్గో రోజు సోమవడం మాత్రం కాస్త హావ తగ్గింది.సోమవారం నాడు సెలవు రోజు కాకపోవడంతో ఈ డ్రాప్స్ వచ్చాయని చెప్పచ్చు. ఇక ఏరియా వైజ్ కలెక్షన్లు చూస్తే… నైజాంలో రూ. 2.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 72 లక్షలు ఉత్తరాంధ్రలో రూ. 71 లక్షలు, ఈస్ట్‌లో రూ. 35 లక్షలు, వెస్ట్‌లో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 34 లక్షలు, కృష్ణాలో రూ. 32 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో కలిపి రూ. 5.18 కోట్లు షేర్, రూ. 8.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

మొత్తం నాల్గు రోజుల్లో..నైజాంలో రూ. 28.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.74 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.5.37 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.95 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.12 కోట్లు, గుంటూరులో రూ. 4.22 కోట్లు, కృష్ణాలో రూ. 2.63 కోట్లు, నెల్లూరులో రూ. 1.98 కోట్లతో కలిపి రూ. 58.25 కోట్లు షేర్, రూ. 79.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All