Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే

భీమ్లా నాయక్ రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. ఇక హిట్ టాక్ వస్తే అంతే సంగతి. మొదటి మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్, రానా కలయికలో వచ్చిన భీమ్లా నాయక్ వరల్డ్ వైడ్ గా శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. వకీల్ సాబ్ తర్వాత పవన్ నుండి వచ్చిన సినిమా కావడం , థమన్ మ్యూజిక్ సూపర్ సక్సెస్ కావడం, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించడం తో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సింగిల్ థియేటర్స్, మల్టీ‌ప్లెక్స్, బీ, సీ సెంటర్లనే తేడా లేకుండా సినిమా హాళ్లలో జన జాతర కొనసాగుతుంది.

- Advertisement -

రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

* నైజాంలో రూ. 7.48 కోట్లు
* సీడెడ్‌లో రూ. 1.56 కోట్లు
* ఉత్తరాంధ్రలో రూ. 1.29 కోట్లు
* ఈస్ట్‌లో రూ. 74 లక్షలు
* వెస్ట్‌లో రూ. 42 లక్షలు
* గుంటూరులో రూ. 65 లక్షలు
* కృష్ణాలో రూ. 64 లక్షలు
* నెల్లూరులో రూ. 36 లక్షలతో కలిపి రూ. 13.14 కోట్లు షేర్, రూ. 20 కోట్లు గ్రాస్ వచ్చింది

రెండు రోజులకు కలిపి చూస్తే..

* నైజాంలో రూ. 19.33 కోట్లు
* సీడెడ్‌లో రూ. 4.84 కోట్లు
* ఉత్తరాంధ్రలో రూ. 3.17 కోట్లు
* ఈస్ట్‌లో రూ. 2.69 కోట్లు
* వెస్ట్‌లో రూ. 3.44 కోట్లు
* గుంటూరులో రూ. 3.16 కోట్లు
* కృష్ణాలో రూ. 1.53 కోట్లు
* నెల్లూరులో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 39.56 కోట్లు షేర్, రూ. 58 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే..ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ ని ప్రీమియర్స్ తో కలిపి సింగిల్ డే లో ఈ చిత్రం వసూలు చెయ్యగా.. ఈ వీకెండ్ నాటికి 1.5 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసిందట. అలాగే డెఫినెట్ గా భీమ్లా నాయక్ అక్కడ 2 మిలియన్ క్లబ్ లో కూడా చేరుతుంది అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్స్ దగ్గర భీమ్లా ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All