Homeటాప్ స్టోరీస్భరత్ అనే నేను టేకింగ్ ఛార్జ్

భరత్ అనే నేను టేకింగ్ ఛార్జ్

bharath ane nenu taking charge on 20 th భరత్ అనే నేను టేకింగ్ ఛార్జ్ ఆన్ 20 th . మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం భరత్ అనే నేను ఈనెల 20న భారీ ఎత్తున విడుదల అవుతోంది . ఈ సినిమాపై అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే మహేష్ – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది , దాంతో ఈ సినిమాపై కూడా అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి .

అంతేకాకుండా మహేష్ నటించిన గత చిత్రాలు డిజాస్టర్ లుగా నిలవడంతో తప్పనిసరిగా మహేష్ కు ఇది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే . పైగా ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు కాబట్టి ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి . కొరటాల శివ సినిమా అంటే సందేశం తో పాటుగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అందుకే భరత్ అనే నేను ఛార్జ్ తీసుకుంటే రికార్డుల మోత మోగడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు . వేసవి సెలవులు కూడా తోడయ్యాయి కాబట్టి సినిమా బాగుంటే డబుల్ రీ ఛార్జ్ కావడం ఖాయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All