Homeటాప్ స్టోరీస్భరత్ అనే నేను చెత్త సినిమా అంటున్న శ్రీరెడ్డి

భరత్ అనే నేను చెత్త సినిమా అంటున్న శ్రీరెడ్డి

bharat ane nenu worst movie says srireddy శ్రీరెడ్డి లీక్స్ తో పెను సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి తాజాగా మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరింత సంచలనం సృష్టించింది . మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో అసలు కంటెంట్ లేదని అలాగే మహేష్ నటన కూడా బాగోలేదని ……. మహేష్ ఎక్కడా మెరుగైన నటన కనబరచలేదు అసలు ఎక్స్ ప్రెషన్ లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది . అంతేనా కొరటాల శివ డైరెక్షన్ చెత్తగా ఉంది టోటల్ గా భరత్ అనే నేను పరమ చెత్త సినిమా అంటూ కామెంట్ చేసి మహేష్ అభిమానులను రెచ్చగొడుతోంది .

అసలు భరత్ అనే నేను సినిమా ఎలా బ్లాక్ బస్టర్ అయ్యిందో అర్ధం కాలేదు బహుశా మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మాత్రమే బ్లాక్ బస్టర్ అయి ఉంటుంది తప్ప భరత్ అనే నేను సినిమాలో కంటెంట్ లేదు అంటూ కామెంట్ చేసింది . ఏప్రిల్ 20 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన భరత్ అనే నేను చిత్రం రెండు వారాల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది మహేష్ కున్న క్రేజ్ దృష్ట్యా కానీ శ్రీరెడ్డి మాత్రం భరత్ అనే నేను పరమచెత్త సినిమా అంటూ కామెంట్ చేయడంతో మరో పెద్ద వివాదం చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే ఈరోజు నుండి మహేష్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి ని ట్రోల్ చేయడం మొదలు పెడతారు కాబట్టి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All