Monday, August 15, 2022
Homeటాప్ స్టోరీస్భరత్ అనే నేను రివ్యూ

భరత్ అనే నేను రివ్యూ

bharat-ane-nenu-review-ratingనటీనటులు : మహేష్ బాబు , కియారా అద్వానీ , ప్రకాష్ రాజ్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత : డివివి దానయ్య
దర్శకత్వం : కొరటాల శివ
రేటింగ్ : 3. 5/ 5
రిలీజ్ డేట్ : 20 ఏప్రిల్ 2018

- Advertisement -

 

మహేష్ బాబు ముఖ్యమంత్రి గా నటించిన చిత్రం భరత్ అనే నేను ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది . కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . మరి మహేష్ బాబు ముఖ్యమంత్రి గా అలరించాడా ? లేదా అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

 

కథ :

లండన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న భరత్ రామ్ ( మహేష్ బాబు ) కు తన తండ్రి అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాఘవ (శరత్ కుమార్ ) చనిపోయాడని తెలియడంతో విషాదంతో ఇండియాకు బయలుదేరుతాడు . తిరిగి లండన్ వెళ్లి పోవాలని అనుకుంటున్న సమయంలో నవోదయం పార్టీ అధినేత వరద రాజు ( ప్రకాష్ రాజ్ ) భరత్ ని ముఖ్యమంత్రి ని చేస్తాడు . ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన మాట కోసం దూకుడు గా వ్యవహరిస్తాడు భరత్ అయితే అనూహ్యంగా అధికార పార్టీ నుండే భరత్ కు వ్యతిరేకత ఎదురు అవుతుంది ? దాంతో భరత్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు , చివరకు మాట మీద నిలబడని రాజకీయ నాయకులను భరత్ ఏమి చేసాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

మహేష్ బాబు నటన
కియారా అద్వానీ గ్లామర్
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
డైలాగ్స్
ఛాయాగ్రహణం

 

డ్రా బ్యాక్స్ :

స్లో నెరేషన్
క్లైమాక్స్

నటీనటుల ప్రతిభ :

మహేష్ బాబు ఈ చిత్రంలో మరింత స్టైలిష్ గా , రొమాంటిగ్గా ఉన్నాడు , ఇక ముఖ్యమంత్రి పాత్రలో సైతం అద్భుత నటన కనబరిచి అభిమానులని మాత్రమే కాకుండా యావత్ ప్రేక్షకులను అలరించాడు మహేష్ . మహేష్ కెరీర్ లోనే ది బెస్ట్ భరత్ అనే క్యారెక్టర్ అనిపించేలా చేసాడు. లవ్ సీన్స్ లో ఎంత రొమాంటి గా కనిపించాడో ముఖ్యమంత్రిగా అంతే హుందా ని ప్రదర్శించాడు . ఇక కియారా అద్వానీ కూడా తన పాత్రలో లీనమై నటించింది . మహేష్ – కియారా జంట చాలా బాగుంది కూడా . అలాగే మిగతా పాత్రల్లో ప్రకాష్ రాజ్ , శరత్ కుమార్ , సితార , బ్రహ్మాజీ , అజయ్ , రావు రమేష్ , దేవరాజ్ లు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు .

సాంకేతిక వర్గం :

దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటల్లో వచ్చాడయ్యో స్వామి , భరత్ అనే నేను సూపర్ హిట్ అయ్యాయి అలాగే నేపథ్య సంగీతం తో దేవి ఆకట్టుకున్నాడు . రవి కే చంద్రన్ , తిరు ల ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ . శ్రీకర్ ప్రసాద్ సినిమాని గ్రిప్పింగ్ నడిపించాడు . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు కొరటాల విషయానికి వస్తే ……. రాజకీయ నేపథ్యంలో మంచి కథ ని ఎంచుకున్న అందులో కొన్ని సమస్యలను అడ్రస్ కూడా చేసిన విధానం బాగానే ఉంది . అయితే కొన్ని లిమిట్స్ దాటిన కొరటాల ఓవరాల్ గా మహేష్ కు కావాల్సిన సూపర్ హిట్ ని అందించాడు .

ఓవరాల్ గా :

రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం సెకండాఫ్ లో కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ అభిమానులకు మాత్రమే కాదు యావత్ ప్రేక్షకులకు సైతం బాగా నచ్చే సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts