Homeటాప్ స్టోరీస్భరత్ అనే నేను కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి

భరత్ అనే నేను కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి

bharat ane nenu collections droppedభరత్ అనే నేను ఇండస్ట్రీ ని దుమ్ము దులిపే విజయాన్ని సొంతం చేసుకుంటుందని అనుకున్నారు కానీ ఆ స్థాయిలో విజయం సాధించలేక పోతోంది మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను . రెండు వారాలలో భరత్ అనే నేను 190 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . మహేష్ బాబు భరత్ అనే నేను సూపర్ హిట్ అయ్యింది అందులో ఎలాంటి సందేహం లేదు కానీ సదరు చిత్ర బృందం చెబుతున్నట్లుగా బ్లాక్ బస్టర్ స్థాయి విజయం అయితే కాదు .

వేసవి సెలవులు కావడంతో మరో సినిమా ఏది లేకపోవడంతో మహేష్ సినిమాకు బాగా కలిసి వచ్చింది దాంతో రెండు వారాలలో 190 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యింది . అయితే 190 కోట్లు వసూల్ కాకముందే 200 కోట్ల క్లబ్ లో భరత్ అనే నేను అంటూ ప్రచారం మొదలు పెట్టారు ఆ చిత్ర బృందం దాంతో విమర్శలు వచ్చాయి ఎందుకంటే భరత్ అనే నేను సూపర్ హిట్ రేంజ్ సినిమా కానీ అనవసరంగా విమర్శలకు తావిచ్చేలా ఎక్కువ వసూళ్లు వస్తున్నట్లుగా ప్రకటించడంతో ఈ విమర్శలు వచ్చాయి దాంతో దాన్ని సరిచేసుకోవడానికి తాజాగా 190 కోట్లు వసూల్ అయినట్లుగా ప్రకటించారు . మొత్తానికి మహేష్ బాబు భరత్ అనే నేను గొప్ప చిత్రమనే చెప్పాలి ఎందుకంటే బ్రహ్మోత్సవం , స్పైడర్ వంటి డిజాస్టర్ ల తర్వాత వచ్చిన భారీ విజయం కాబట్టి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All