Homeటాప్ స్టోరీస్యాభై రోజులను పూర్తిచేసుకున్న భరత్ అనే నేను

యాభై రోజులను పూర్తిచేసుకున్న భరత్ అనే నేను

bharat ane nenu 50 days completedమహేష్ బాబు నటించిన భరత్ అనే నేను దిగ్విజయంగా 50 రోజులను పూర్తిచేసుకుంది . కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించగా మహేష్ బాబు సరసన బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటించింది . ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు . మహేష్ ముఖ్యమంత్రి గా నటించి అభిమానులను మాత్రమే కాకుండా యావత్ ప్రేక్షకులను అలరించాడు . భారీ పరాజయాల తర్వాత మహేష్ కు దక్కిన బ్లాక్ బస్టర్ ఈ భరత్ అనే నేను .

ఏప్రిల్ 20 న భారీ ఎత్తున విడుదలైన భరత్ అనే నేను చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల కు పైగా వసూల్ చేసింది ఈ చిత్రం . ఒకప్పుడు యాభై , వంద రోజుల పండగలు ఉండేవి కానీ అవిప్పుడు లేవు అలాంటి సమయంలో భరత్ అనే నేను చిత్రం యాభై రోజులను పూర్తిచేసుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నారు మహేష్ అభిమానులు . ఇక మహేష్ – నమ్రత ల ఆనందానికి అంతే లేకుండా పోయింది . ప్రస్తుతం వంశీ పైడిపల్లి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు మహేష్ .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All