Homeటాప్ స్టోరీస్ఆ వివాదం ముగిసిందట

ఆ వివాదం ముగిసిందట

Bhanupriya clarified her maid case సీనియర్ నటి భానుప్రియ పై ఆమె ఇంట్లో పనిచేసే అమ్మాయి తల్లి సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే . అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెన్నై వెళ్లి భానుప్రియని విచారించడంతో పాటుగా సదరు బాధిత బాలికని పిల్లల సంరక్షణ విభాగం వాళ్లకు అప్పగించడంతో ప్రస్తుతానికి ఆ వివాదం సద్దుమణిగింది . సామర్లకోట, సండ్ర వారి గ్రామానికి చెందిన ప్రభావతి కూతురు భానుప్రియ ఇంట్లో పనిచేస్తోంది .

అయితే ఆ అమ్మాయి కి ప్రస్తుతం 16 ఏళ్ళు కాగా 14 ఏళ్ల వయసులోనే భానుప్రియ ఇంట్లో పనిమనిషిగా పెట్టారు . మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత తన కూతురుపై భానుప్రియ సోదరుడు అత్యాచారం చేసాడని సంచలన ఆరోపణలు చేసింది పనిమనిషి తల్లి ప్రభావతి . అయితే అవన్నీ అబద్ధాలని , మా ఇంట్లో విలువైన వస్తువులను దొంగిలించారని మేము గట్టిగా అడిగేసరికి ఇలా తప్పుడు కేసు పెట్టారని అంటోంది భానుప్రియ . ప్రస్తుతానికి రాజీ జరిగిందట దాంతో వివాదం లేదని అంటున్నారు మరి .

- Advertisement -

English Title: Bhanupriya clarified her maid case

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All