Homeటాప్ స్టోరీస్`భానుమ‌తి అండ్‌ రామ‌కృష్ణ` మూవీ రివ్యూ

`భానుమ‌తి అండ్‌ రామ‌కృష్ణ` మూవీ రివ్యూ

`భానుమ‌తి అండ్‌ రామ‌కృష్ణ` మూవీ రివ్యూ
`భానుమ‌తి అండ్‌ రామ‌కృష్ణ` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: న‌వీన్ చంద్ర‌, స‌లోని లుథ్రా, రాజా చెంబోలు, హ‌ర్ష చేముడు, వైవా హ‌ర్ష త‌దిత‌రులు న‌టించారు.
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌కాంత్ నాగోతి
నిర్మాత : య‌శ్వంత్ ములుక‌ట్ల‌,
సంగీతం : శ‌్ర‌వ‌ణ భ‌ర‌ద్వాజ్‌,
సినిమాటోగ్ర‌ఫీ :  సాయి ప్ర‌కాష్‌
రిలీజ్ డేట్ : 3-07-2020
డిజిట‌ల్ రిలీజ్ : `ఆహా` ఓటీటీ
రేటింగ్ : 3/5

క‌రోనా ప్ర‌భావంతో థియేట‌ర్‌లు ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. దీంతో చాలా వ‌ర‌కు సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. అలా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రం `భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌`. న‌వీన్ చంద్ర‌, స‌లోని లూథ్రా జంట‌గా న‌టించారు. రోమాంటిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల (జూలై 3న‌) 3న `ఆహా` ఓటీటీలో విడుద‌లైంది. విభిన్న‌మైన చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న న‌వీన్‌చంద్ర న‌టించిన ఈ చిత్రం అంచ‌నాల‌కు అనుగుణంఆనే వుందా?  టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ చిత్రం ఓటీటీ ప్రేమికుల్ని మెప్పిస్తోందా? తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:
భానుమ‌తి (స‌లోని లుథ్రా) పేరు ఓల్డ్‌గా వున్నా అధునిక భావాలున్ననేటి యువ‌తి. ఓ అడ్వ‌ర్టైజింగ్ కంప‌నీలో మంచి స్థాయిలో వుంటుంది. భానుమ‌తికి ఆత్మాభిమానంతో పాటు ఆత్మ విశ్వాసం ఎక్కువే. త‌న‌కంటూ కొన్ని ప‌ద్ద‌తుల్ని బౌండ‌రీల‌ని పెట్టుకుని జీవించేస్తుంటుంది. రామ్ ( రాజా చెంబోలు)ని ప్రేమిస్తుంది. కానీ అత‌నితో బ్రేక‌ప్ కావ‌డం, ఇంట్లో వాళ్లు 30 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోవ‌డం లేదంటూ టార్చ‌ర్ పెడుతుండ‌టంతో ల‌వ్‌, రిలేష‌న్ విషయంలో క‌న్ఫ్యూజ‌న్‌కి లోన‌వుతూ వుంటుంది. ఇదే స‌మ‌యంలో భానుమ‌తికి రామ‌కృష్ణ అసిస్టెంట్‌గా ఎంట్రీ కంప‌నీలోకి ఎంట్రీ ఇస్తాడు. భానుమ‌తికి విరుద్ధ‌మైన మ‌న‌స్థ‌త్వం రామ‌కృష్ణ‌ది. మొద‌ట్లో అత‌న్ని ఇష్ట ప‌డ‌ని భానుమ‌తి ఆ త‌రువాత అత‌నితో ప్రేమ‌లో ప‌డుతుంది. భిన్న మ‌న‌స్థ‌త్వాలు, భిన్న నేప‌థ్యాలు గ‌ల వీరి ప్రేమ ప్ర‌యాణం ఎలా సాగింది? ఎలా సుఖాంత‌మైంది అన్న‌ది ఓటీటీ తెర‌పై చూడాల్సిందే.

- Advertisement -

న‌టీన‌టుల న‌ట‌న‌:
గ‌త చిత్రాల‌తో పోలిస్తే హీరో న‌వీన్ చంద్ర న‌ట‌న కొత్త పంథాలో సాగింది. కొత్త‌గా క‌నిపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ పాత్ర‌ల్లో న‌టించిన న‌వీన్ చంద్ర ఈ చిత్రంలో మాత్రం రామ‌కృష్ణ‌గా చాలా సెటిల్డ్ పాత్ర‌లో క‌నిపించాడు. ఇక పొగ‌రు బోతు భానుమ‌తి పాత్ర‌లో స‌లోని లుథ్రా త‌న‌దైన మార్కు న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకుంది. వైవా హ‌ర్హ వున్నంత‌లో త‌న‌కు ల‌భించిన స‌న్నివేశాల మేర‌కు న‌వ్విస్తూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. భానుమ‌తిని ప్రేమించే ప్రేమికుడిగా రాజా చెంబోలు, మ‌రో కీల‌క పాత్ర‌లో షాలిని త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించి మెప్పించారు. భాన‌మ‌తి పాత్ర‌లో న‌టించిన స‌లోని లుథ్రాని మ‌రింత అందంగా చూపించి వుంటే బాగుండేది అనిపించ‌క మాన‌దు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు:
ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తీ విభాగం ది బెస్ట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇందులో ప్ర‌ధానంగా చెప్న‌పుకోవాల్సింది ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ నాగోతి గురించి. తెలిసిన క‌థ‌నే అయినా దాన్ని తెర‌పైకి తీసుకురావ‌డంతో కొత్త ద‌నాన్ని జోడించి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్‌ అయ్యాడ‌ని చెప్పొచ్చు. ఎక్క‌డా మెలోడ్రామా భారీగా లేకుండా పాత్ర‌లు, స‌న్నివేశాల్ని స‌హ‌జ‌త్వంగా న‌డిపించిన తీరు శ్రీ‌కాంత్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అద్ధం ప‌డుతుంది. ఇక క‌థ‌, క‌థ‌నాల కంటే ఇందులో డైలాగ్స్ బాగా కుదిరాయి. డైలాగ్స్‌కి క్రెడిల్ ఇవ్వాల్సిందే. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌ అందించిన పాట‌లు ఫ‌ర‌వాతేద‌నిపించాయి. అయితే బీజియ‌మ్స్ ఆక‌ట్టుకునే విధింగా వున్నాయి. సాయి ప్ర‌కాష్ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. స‌న్నివేశాల‌ని త‌న కెమెరా క‌న్నుతో చూపించిన విధానం బాగుంది. ఎడిటింగ్ ఓకే.

విశ్లేష‌ణ‌:
గంట‌న్న‌ర నిడివితో సాగే ఈ చిత్రంలో మ‌రిన్ని రొమాంటిక్ స‌న్నివేశాలు జోడించి నిడివి పెంచి వుంటే బాగుండేది. హీరో పాత్ర‌కు ప్రాధాన్య‌త త‌గ్గించి హీరోయిన్ పాత్ర‌కే అధిక ప్రాధాన్య‌త నివ్వ‌డం కొంత లోపంగానే క‌నిపిస్తోంది. ఆ విష‌యాన్ని గ్ర‌హించి హీరో పాత్ర‌కు కూడా ప్రాధాన్య‌త‌నిస్తే ఫ‌లితం మ‌రింత బాగుండేది. `భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ` సింపుల్ అండ్ కూల్ ల‌వ్‌స్టోరీ. స‌హ‌జంగా అనిపించే స‌న్నివేశాలు, ఆక‌ట్టుకునే సంభాష‌ణ‌ల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. క‌థ పాత‌దే అయినా ప్ర‌జెంట్ చేసిన విధానం కొత్త‌గా వుండ‌టం ప్ల‌స్ పాయింట్ అని చెప్పొచ్చు. అయితే క‌థ గ‌మ‌నంలో కొంత స్పీడ్‌ని పెంచితే మ‌రింత బాగుండేది. ప్ర‌స్తుత లాక్‌డౌన్ నేప‌థ్యంలో కాల‌క్షేపం చేయ‌డానికి బెస్ట్ ఛాయిస్‌గా ఈ సినిమాని చెప్పుకోవ‌చ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All