Homeటాప్ స్టోరీస్యూట్యూబ్ లో నెం 1 ట్రేండింగ్ లో ఆచార్య భలే భలే సాంగ్

యూట్యూబ్ లో నెం 1 ట్రేండింగ్ లో ఆచార్య భలే భలే సాంగ్

 Bhale Bhale Banjara Trending 1 on YouTube
Bhale Bhale Banjara Trending 1 on YouTube

ఆచార్య భలే భలే బంజారా సాంగ్ యూట్యూబ్ లో నెం 1 ట్రేండింగ్ లో కొనసాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ లు నటిస్తున్న ఆచార్య మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రొమోషన్ల ఫై దృష్టి సారించారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమా ఫై అంచనాలు పెరుగగా..ఈరోజు సాయంత్రం సినిమాలోని భలే భలే బంజారా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో చిరంజీవి , రామ్ చరణ్ లు కలిసి అదిరిపోయే స్టెప్స్ వేసి మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. నిన్న సాయంత్రం విడుదలైన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో సంచలన వ్యూస్ తో టాప్ ట్రేండింగ్ 1 లో కొనసాగుతుంది.

ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ జోడిగా నటించగా.. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటించారు.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All