Homeటాప్ స్టోరీస్భైరవగీత రివ్యూ

భైరవగీత రివ్యూ

bhairava geetha movie review
భైరవగీత రివ్యూ

భైరవగీత రివ్యూ :
నటీనటులు : ధనుంజయ్ , ఇర్రా మోర్
సంగీతం : రవి శంకర్
నిర్మాతలు : వర్మ – అభిషేక్
దర్శకత్వం : సిద్దార్థ
రేటింగ్ : 2. 5/ 5
రిలీజ్ డేట్ : 14 డిసెంబర్ 2018

దర్శకుడిగా ఘోర పరాజయాలను చవిచూసిన రాంగోపాల్ వర్మ ఓ యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి నిర్మించిన చిత్రం భైరవగీత . ధనుంజయ్ఇర్రా మోర్ జంటగా నటించిన ఈ చిత్రంతో వర్మ హిట్ కొట్టాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

తక్కువ కులానికి చెందిన భైరవ (ధనుంజయ్ ) సుబ్బారెడ్డి దగ్గర పనిచేస్తుంటాడు . సిటీ నుండి గ్రామానికి వచ్చిన సుబ్బారెడ్డి కూతురు  గీత ( ఇర్రా మోర్ ) ని చంపడానికి ప్రత్యర్ధులు ప్రయత్నిస్తే వాళ్ళ నుండి గీత ని కాపాడతాడు . దాంతో భైరవ అంటే ఇష్టం ఏర్పడుతుంది గీత కు . అయితే అదే సమయంలో గీత ని మరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు సుబ్బారెడ్డి . దాంతో భైరవ కోసం వెళ్ళిపోతుంది గీత . తన కూతురు ని లేపుకెళ్లిన భైరవ ని చంపడానికి తన మనుషులను పంపిస్తాడు సుబ్బారెడ్డి . తక్కువ కులానికి చెందిన భైరవ సుబ్బారెడ్డి ని ఎలా ఎదిరించాడు . తన కులానికి చెందిన వాళ్ళను ఎలా మేల్కొలిపాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

ధనుంజయ్
ఇర్రా మోర్ గ్లామర్

 

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

 

నటీనటులు :

భైరవగా ధనుంజయ్ అద్భుతంగా నటించాడు . భైరవ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు . యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు ధనుంజయ్ . అలాగే హీరోయిన్ యర్రా మోర్ తో ధనుంజయ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది . బోల్డ్ సన్నివేశాల్లో మరింత బోల్డ్ గా  నటించారు . ఇర్రా మోర్ గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అయ్యింది . గ్లామర్ తో పాటుగా నటనకు కూడా అవకాశం ఉన్న పాత్ర లభించింది ఇర్రా మోర్ కు . మిగిలిన పాత్రలలో ఆయా నటీనటులు  బాగానే రాణించారు .

సాంకేతిక వర్గం :

దర్శకుడు సిద్దార్థ్ విషయానికి వస్తే ….. ప్రారంభంలో కథ ని నడిపించిన తీరు బాగానే ఉన్నప్పటికీ తర్వాత తర్వాత దారి తప్పినట్లయింది . స్క్రీన్ ప్లే  పరంగా మ్యాజిక్ చేయలేకపోయాడు . రొమాన్స్ ని యాక్షన్ ని మిళితం చేయాలనీ అనుకున్నాడు కానీ యాక్షన్ మరీ ఎక్కువయ్యింది దాంతో ప్రేక్షకులు అసహనానికి గురెయ్యేలా ఉంది . సాంకేతికంగా అందరూ సోసోగానే రాణించారు .

ఓవరాల్ గా :

ఓసారి భైరవగీత ని చూడొచ్చు అంచనాలు లేకుండా

English Title: bhairava geetha movie review

                                      Click here for English Review

YouTube video

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All