
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మ్యాచో లుక్స్‌తో అల్లాడిస్తున్నాడు. గత ఏడు నెలలుగా షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇంటి పట్టునే వుంటున్న ఆయన లాక్‌డౌన్ పిరియడ్‌లో తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశారు. వరుస ఫొటోషూట్‌లతో తనలోని కొత్త కోణాన్ని, కొత్త లుక్స్‌ని బయటపెట్టారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన స్పెషల్ ఫొటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొన్ని ఫొటోల్లో రెట్రో లుక్‌లో కనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్ మ్యాచో లుక్స్‌తో టెర్రిఫిక్‌గా కనిపించారు. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోల్లో సోఫా పై స్టైల్‌గా వాలిపోయి డాన్ తరహాలో లుక్కివ్వడం ఆకట్టుకుంటోంది. బారు గడండం.. గుబురు మీసం… కళ్లని స్టైలిష్ గాగుల్స్‌తో బెల్లంకొండ అదరగొడుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `అల్లుడు అదుర్స్`.
`కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ చివరి షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి ప్రకాష్‌రాజ్, సొనుసుద్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.