Homeటాప్ స్టోరీస్బెల్లంకొండ ఫ్యామిలీ నుండి ఇంకొక హీరో వస్తున్నాడు...

బెల్లంకొండ ఫ్యామిలీ నుండి ఇంకొక హీరో వస్తున్నాడు…

బెల్లంకొండ ఫ్యామిలీ నుండి ఇంకొక హీరో వస్తున్నాడు...
బెల్లంకొండ ఫ్యామిలీ నుండి ఇంకొక హీరో వస్తున్నాడు…

‘బెల్లంకొండ సాయి శ్రీనివాస్’ చాలా ఫ్లాపుల మధ్య ఈ మధ్య “రాక్షసుడు” సినిమా ద్వార హిట్ కొట్టాడు. కథ తమిళ పరిశ్రమ నుండి వచ్చినా కూడా, అక్కడ ఎలా తీశారో, ఇక్కడ కూడా అలానే తీసి ఏమి తేడాలేకుండా చేయడంతో సినిమా హిట్ దిశగా వెళ్లి సక్సెస్ అయ్యింది.

అయితే మొదట ‘అల్లుడు శీను’ సినిమా అప్పుడు కూడా ‘బెల్లంకొండ సురేష్’ బాబు సాయి శ్రీనివాస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ తారాగణంతో మాస్ డైరెక్టర్ ‘వి.వి.వినాయక్’ దర్శకత్వంలో చేసినప్పటికీ, ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమంత, తమన్నా, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళతో ఆడియో రిలీజ్ అయ్యి, సినిమా విడుదల అయ్యేంతవరకు ప్రతి చిన్న విషయంలో తీసుకున్న శ్రద్ధ ఇప్పుడు సాయి శ్రీనివాస్ అనుభవిస్తున్నాడు.

- Advertisement -

సాయి శ్రీనివాస్ కూడా తన తమ్ముడిని ‘బెల్లంకొండ గణేష్’ ని పరిచయం చెయ్యాలి అని అనుకుంటున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ సినిమాల దర్శకుడు ‘పవన్ సాధినేని’ చెప్పిన లైన్ బెల్లంకొండ ఫ్యామిలీ మొత్తానికి నచ్చిందంటా. అలా చిన్న కుమారుడు గణేష్ గురించి శ్రీనివాస్ ఆలోచించడం మంచి పని అంటున్నారు సురేష్ గారు.

మరి 2 సినిమాలు తీసిన దర్శకుడు ‘పవన్ సాధినేని’ ఇదివరకే ఫ్లాప్ దర్శకుడు అని పేరు పొందినా కూడా లైన్ నచ్చిందంటేనే ఇక్కడే ఆలోచించాల్సిన విషయం అని సన్నిహితులు అంటున్నారు. హీరోయిన్ గా ‘న‌భా నటేష్’ ని అనుకుంటున్నారంటా. అయితే తనకంటూ నటన పరంగా ఏమి తెలియని ఇంకా నటించాలని అనుభం రాని, లేని సాయి శ్రీనివాస్ తన తమ్ముడికి ఎలా చెప్తాడో అని అందరూ అనుకుంటున్నారు. దసరాకి ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారంటా. భారీ తారాగణాన్ని కూడా తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All