Homeఎక్స్ క్లూసివ్హిట్ కోసం బాలయ్య టైటిల్ ని వాడుకుంటున్నాడు

హిట్ కోసం బాలయ్య టైటిల్ ని వాడుకుంటున్నాడు

Bangaru bullodu title for allari naresh next film
Allari Naresh

1993 లో నందమూరి బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది . రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాని జగపతిబాబు తండ్రి నిర్మించాడు . కాగా ఇన్నాళ్ల తర్వాత ఆ టైటిల్ తో కెమెడీ హీరో అల్లరి నరేష్ అదే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు . గత ఏడేళ్లుగా అల్లరి నరేష్ కు హిట్ లేదు దాంతో హిట్ కోసం బాలయ్య బాబు నటించిన బంగారు బుల్లోడు టైటిల్ ని పెట్టుకుంటున్నాడు అల్లరి నరేష్ .

చాలా కాలంగా హిట్ అనేది అల్లరి నరేశ్ కు తెలీదు దాంతో రేసులో లేకుండా పోయాడు ఈ హీరో . సక్సెస్ కోసం ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పాపం అది అందని ద్రాక్షే అవుతోంది . ఇక సక్సెస్ లేకపోవడంతో ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్రంలో కీలక పాత్ర ఒకటి చేస్తున్నాడు . ఆ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వస్తానని ఆశిస్తున్నాడు అందుకే ఆ సినిమా తర్వాత బంగారు బుల్లోడు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . గిరి అనే కొత్త దర్శకుడు బంగారు బుల్లోడు చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు .

- Advertisement -

English Title: Bangaru bullodu title for allari naresh next film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All