Homeటాప్ స్టోరీస్బంగార్రాజు బుల్లితెరపై ఎంత టీఆర్పీ రేటింగ్ వచ్చిందంటే

బంగార్రాజు బుల్లితెరపై ఎంత టీఆర్పీ రేటింగ్ వచ్చిందంటే

bangarraju movie TRP Rating
bangarraju movie TRP Rating

నాగార్జున , నాగచైతన్య , రమ్యకృష్ణ , కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచి , మంచి కలెక్షన్లు రాబట్టింది. 2016 లో విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ థియేటర్స్ లలోనే కాదు ఓటిటి లో కూడా అలరించింది. తాజాగా జీ తెలుగు లో ప్రీమియర్ మూవీ గా ప్రసారమై..మంచి టీఆర్పీ రేటింగ్ సాధించి వార్తల్లో నిలిచింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానెల్ లో టెలికాస్ట్ అయిన బంగార్రాజు సినిమాకు 14 టీఆర్పీ వచ్చింది. ఈమధ్య కాలంలో నాగార్జున నటించిన ఏ సినిమాకూ ఈ స్థాయిలో రేటింగ్ రాలేదు. ఆఫీసర్, మన్మధుడు-2 లాంటి సినిమాలు టీవీల్లో కూడా ఫెయిల్ అయ్యాయి. ఎట్టకేలకు బంగార్రాజు సినిమాతో సిల్వర్ స్క్రీన్ తో పాటు, స్మాల్ స్క్రీన్ పై కూడా సక్సెస్ అందుకున్నాడు నాగ్. ఈ సినిమా తో పాటు అశోక్ గల్లా నటించిన హీరో సినిమాను స్టార్ మా ఛానెల్ లో ప్రసారం చేస్తే, కేవలం 2 టీఆర్పీ వచ్చింది. ఇక నూటొక్క జిల్లాల అందగాడు సినిమాను ఈటీవీలో ప్రసారం చేస్తే, ఘోరంగా 1 టీఆర్పీ మాత్రమే రేటింగ్ వచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All