Homeటాప్ స్టోరీస్పవర్ స్టార్ కు బండ్ల గణేష్ రిక్వెస్ట్

పవర్ స్టార్ కు బండ్ల గణేష్ రిక్వెస్ట్

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మరోసారి పవన్ కళ్యాణ్ ఫై తన అభిమానాన్ని చాటుకున్నారు. చిత్రసీమలోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన గణేష్..అతి తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించే స్థాయికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రవితేజ , రామ్ చరణ్ తో పాటు పలువురు హీరోలతో సినిమాలు చేసారు.

- Advertisement -

ఇక పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడిగా పిలువబడే గణేష్..తాజాగా ట్విట్టర్ ద్వారా మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే..’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

అయితే గత కొంత కాలంగా బండ్లనప్న పవన్ కు దూరంగా వుంటూ వస్తున్నారు. అదేమంటే తనని కొంత మంది కావాలనే నా దేవర పవన్ కల్యాణ్ కు దూరం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అంతే కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కారణంగానే తాను పవన్ కల్యాణ్ కు దూరం చేయబడుతున్నానని బండ్ల గణేష్ ఆ మధ్య విడుదల చేసిన ఆడియో టేప్ నెట్టింట తీవ్ర కలకలం సృష్టించింది. అప్పటి నుంచి సైలెంట్ గా వుంటున్న బండ్లన్న గాలి తాజాగా పవన్ కల్యాణ్ వైపు మళ్లింది. ఈ నేపథ్యంలో పవన్ పై బండ్లన్న శనివారం సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ లు నెట్టింట వైరల్ గా మారాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All