Homeటాప్ స్టోరీస్నా గెలుపు ఖాయం.. రాకెట్ లా దూసుకెళ్తానంటున్న బండ్ల గణేష్..!

నా గెలుపు ఖాయం.. రాకెట్ లా దూసుకెళ్తానంటున్న బండ్ల గణేష్..!

Bandla  Ganesh  Nomination for MAA Elections As General Secretary Tollywood

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓ పక్క ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు అధ్యక్షిడిగా పోటీ పడుతున్నారు. అయితే ఈసారి మా ఎలక్షన్స్ లో జనరల్ సెక్రటరీగా సోలోగా పోటీ చేస్తున్నారు బండ్ల గణేష్. ఈసారి మా ఎలక్షన్స్ లో జనరల్ సెక్రటరీగా తన గెలుపు కన్ఫర్మ్ అంటున్నారు బండ్ల గణేష్. అంతేకాదు తనకు ఎంతోమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని అన్నారు. మా ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నారు బండ్ల గణేష్.

- Advertisement -

సోమవారం నామినేషన్స్ వేసిన బండ్ల గణేష్ అనంతరం మీడియాతో మాట్లాడారు. మా ఎన్నికల్లో తాను రాకెట్ లా దూసుకెళ్తున్నానని.. తన గెలుపుని ఎవరూ ఆపలేరని అన్నారు. తాను గెలిస్తే 100 మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అందేలా చేస్తానని అన్నారు బండ్ల గణేష్.

మా అసోసియేషన్ కు బిల్డింగ్ కావాలి. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో ప్యాలెస్ కడతామంటే కుదరదు. ప్రభుత్వం ప్లేస్ ఇస్తుందో లేదో తెలియదు. కాస్త దూరమైనా కోకా పేట ప్రాంతంలో స్థలం తీసుకుని.. 100 మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కటించాలి. సీ.ఎం కే.సి.ఆర్ దగ్గరకు వెళ్లి మహా ప్రభూ మాకు స్థలం ఇప్పించండి.. మా డబ్బులతో ఇల్లు కట్టుకుంటాం.. డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తే ఎంత గొప్పపఓ మీరు పెద్ద మనసుతో ఆలోచించండి అని తన అభిప్రాయాన్ని తెలిపారు బండ్ల గణేష్.

అంతేకాదు ఫండ్స్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. అంత అవసరమా.. పరిశ్రమలో వినోదాన్ని పంచే కళాకారులు చాలా మంది ఉన్నారు. వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి ఫండ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది..? మన హీరోలు బంగారు గనులు.. కొహినూర్ వజ్రాలు.. ఆ వజ్రాలు ప్రకాశిస్తే.. ఎన్నో భవనాలు కట్టొచ్చని అన్నారు బండ్ల గణేష్. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో ప్రోగ్రాం చేసి అలా వచ్చిన డబ్బుతో ఇళ్లులు కట్టొచ్చని అన్నారు. మా ఎన్నికలు జరుగుతున్న టైం లో ఏపీ రాజకీయాల గురంచి మాట్లాడనని చెప్పారు బండ్ల గణేష్. 11వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతా అని అన్నారు. జీవితా రాజశేఖర్ గురించి ప్రస్తావించిన బండ్ల గణేష్ మాలో మాకు గొడవలు పెట్టొద్దని అన్నారు. మా ఎలక్షన్స్ లో అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఎవరు గెలిచినా వారు నాకు ప్రెసిడెంట్ అని అన్నారు బండ్ల గణేష్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All