Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్స్టార్ కమెడియన్ పై నిషేధం

స్టార్ కమెడియన్ పై నిషేధం

Ban on kollywood star comedian vadiveluతమిళనాట టాప్ కమెడియన్ గా వెలుగొందుతున్న వ్యక్తి వడివేలు , ఒకానొక దశలో స్టార్ హీరోలు సైతం వడివేలు డేట్స్ చూసుకొనే షూటింగ్ పెట్టుకునే వాళ్లంటే అతడు ఏ స్థాయికి చేరుకున్నాడో యిట్టె అర్ధం చేసుకోవచ్చు . తెలుగులో బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్ అన్నమాట ! అయితే అదంతా ఒకప్పుడు ఇప్పుడు కాదు ఎందుకంటే అతడు స్టార్ కమెడియన్ గా వెలుగొందుతున్న రోజుల్లోనే సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లి దెబ్బతిన్నాడు కట్ చేస్తే అవి నేర్పిన గుణపాఠంతో మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు .

- Advertisement -

అయితే ఇప్పుడు సకాలంలో షూటింగ్ కి రాకుండా , ఒకవేళ షూటింగ్ కి వస్తే ఫుల్లుగా మద్యం తాగేసి వస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నాడట దర్శక నిర్మాతలను . తాజాగా హింసే సరసన్ 23వ పులకేశి అనే చిత్రం చేస్తున్నాడు వడివేలు . భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కు సకాలంలో రాకుండా ఇబ్బంది పెడుతున్నాడట అంతేకాదు మద్యం తాగి వస్తూ షూటింగ్ కి ఇబ్బంది కలిగించడంతో అతడ్ని మందలించారట దాంతో నేను షూటింగ్ కి రానని చెప్పడంతో వడివేలు పై చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించారు . దాంతో 9 కోట్ల నష్టపరిహారం ఇవ్వు లేదంటే నిన్ను బ్యాన్ చేస్తామని ఆదేశాలు జారీ చేయగా వాటిని ఖాతరు చేయలేదు వడివేలు దాంతో వడివేలు పై నిషేధం విధించింది ఫిలిం ఛాంబర్ .

English Title: Ban on kollywood star comedian vadivelu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts