Homeటాప్ స్టోరీస్విలన్ గా నటిస్తానంటున్న బాలయ్య

విలన్ గా నటిస్తానంటున్న బాలయ్య

Balakrishna wants do negetive roleవిలన్ పాత్రలు పోషించడానికి నేను రెడీ , అయితే కథ నచ్చాలి అని సంచలన వ్యాఖ్యలు చేసాడు నందమూరి బాలకృష్ణ . టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హీరో అలాగే మాస్ లో విపరీతమైన ఇమేజ్ ఉన్న హీరో అలాంటిది బాలయ్య విలన్ గా నటిస్తే నందమూరి అభిమానులు ఊరుకుంటారా ? అందుకే ఆ విషయాన్నీ కూడా బాలయ్యే చెప్పాడు . విలన్ గా నటించడానికి నేను రెడీ కానీ నా అభిమానులు ఒప్పుకోరేమో ఏకంగా కేసులు పెట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నాడు . సైమా అవార్డుల వేడుక కోసం దుబాయ్ వెళ్లిన బాలయ్య అక్కడ ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చి షాక్ ఇచ్చాడు .

ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తూ నిర్మిస్తున్నాడు కూడా . బాలయ్య కెరీర్ లోనే క్రేజీ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై బాలయ్య భారీగా ఆశలు పెట్టుకున్నాడు . ఇక ఇందులో మిగతా స్టార్స్ కూడా యాడ్ అవ్వడంతో ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . బిజినెస్ కూడా వీర లెవల్లో జరుగుతోంది . ఇక ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది 2019 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: Balakrishna wants do negative role

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All