Homeటాప్ స్టోరీస్కాల్చి పారేస్తా నా కొడకా అంటున్న బాలయ్య

కాల్చి పారేస్తా నా కొడకా అంటున్న బాలయ్య

balakrishna vinayak movie gets title ak 47ఏకే 47 కాల్చి పారేస్తా నా కొడకా అని అంటున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ . తాజాగా వివివినాయక్ దర్శకత్వంలో బాలయ్య నటించడానికి ఒప్పుకున్నాడు అయితే ఆ సినిమాకు కథ ఇంకా సెట్ కాలేదు కానీ టైటిల్ మాత్రం పెట్టుకున్నారు ” ఏకే 47” అని . దానికి ట్యాగ్ లైన్ గా కాల్చి పారేస్తా నా కొడకా అనేది పెట్టాలని చూస్తున్నారు . బాలయ్య సినిమాలు అంటనే అదో తరహాలో ఉంటాయి దాంతో ఈ సినిమాకు ఏకే 47 పెట్టడం విచిత్రం ఏమి కాదు .

ఇంతకుముందు బాలయ్య – వినాయక్ ల కాంబినేషన్ లో ” చెన్నకేశవరెడ్డి ” అనే చిత్రం వచ్చింది అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు . ఆ సినిమా తర్వాత బాలయ్య తో మళ్ళీ వినాయక్ సినిమా ఏది చేయలేదు . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత బాలయ్య – వినాయక్ ల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది . ఇక ఈ చిత్రాన్ని సి . కళ్యాణ్ నిర్మించనున్నాడు . చెన్నకేశవరెడ్డి చిత్రంతో అనుకున్న హిట్ కొట్టలేక పోయారు కనీసం ఇప్పుడైనా ఈ ఏకే 47 తో హిట్ కొడతారో చూడాలి . ప్రస్తుతం కథ అన్వేషణలో ఉన్నారు వినాయక్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All