
అప్పట్లో ప్రాథమిక చికిత్స తీసుకున్న ఆయనకు మేజర్ సర్జరీ నిర్వహించాలని వైద్యులు తేల్చారు. అయినప్పటికీ ఆయన జైసింహా చిత్రం షూటింగ్ సందర్భంగా బిజీబిజీగా ఉండిపోయారు. దీంతో ఈ సర్జరీ చేసుకోలేకపోయారు. ఈ నొప్పి రోజురోజుకి తీవ్రమవడంతో సర్జరీ అనివార్యమయ్యింది. ఈ సర్జరీ చేసుకోవడానికి బాలక్రిష్ణ శనివారం ఉదయం కాంటినెంటల్ హాస్పిటల్ కి ఉదయం ఎనిమిదిన్నగంటలకు చేరుకున్నారు. వెంటనే కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ (పూణే) ఆయన కుడిచేయికి సర్జరీ చేసింది. గంటసేపు జరిగిన ఈ సర్జరీ విజయవంతమైందని వైద్యులు తెలిపారు.
- Advertisement -