Homeటాప్ స్టోరీస్పండగకి నందమూరి అభిమానులు కాచుకోండి...రెడీ గా ఉండండి...

పండగకి నందమూరి అభిమానులు కాచుకోండి…రెడీ గా ఉండండి…

Balakrishna
పండగకి నందమూరి అభిమానులు కాచుకోండి…రెడీ గా ఉండండి…

మన అందరికి ఇష్టమైన హీరో అంటే టాలీవుడ్ లో ఎక్కువగా వినపడే పేరు నటసింహం “నందమూరి బాలకృష్ణ“. సినిమాలు హిట్ అయితే థియేటర్ లో గోల గోల చేస్తారు. అదే సినిమా ఆడకపోయినా కూడా బాలయ్య డైలాగు లు ఎలా చెప్తున్నాడు అని వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. బయట కూడా తాను అభిమానులందరితో చాలా ఖుషీగా ఉంటారు అని కూడా విన్నాం. అడపాదడపా అప్పుడప్పుడు బాలయ్య బాబు నోరు అదుపు తప్పి మాట్లాడటం, అవి బాగా పాపులర్ అవ్వడం కూడా చూసాం, మొతానికి బాలయ్య పేరు అలా మారు మోగిపోతుంది.

సినిమాల విషయంలో ఎంతో కేర్ తీసుకునే బాలయ్య తన 105 వ చిత్రం తమిళ దర్శకుడు ‘కేఎస్ రవికుమార్’ గారి దర్శకత్వం లో చేస్తున్నారు, సినిమాకి ‘రూలర్’ అని అనుకుంటున్నారు అని ఫిలిం నగర్ లో చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా ఇదే టైటిల్ ఉండొచ్చు అని కూడా అంటున్నారు సినిమా విడుదల ఎప్పుడనే విషయంపై ఇంకా సమాచారం లేదు కానీ డిసెంబర్ లో రిలీజ్ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ రెడీ అవుతున్నారని సమాచారం.

- Advertisement -

దసరా సీజన్ త్వరలో ప్రారంభం కానుంది కదా..విజయదశమి రోజే ‘రూలర్’ టీజర్ ను రిలీజ్ చేస్తే సెంటిమెంట్ పరంగా బాగుంటుందని బాలయ్య అభిప్రాయపడ్డారట. ఈ టీజర్ రిలీజ్ విషయం అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. మరోవైపు ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అక్టోబర్ 5 న ప్రారంభిస్తారట. ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా సోనాల్ చౌహాన్.. కాంచన 3 వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నాడు. సీనియర్ హీరోయిన్ భూమిక ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో నటిస్తోంది. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని సీ. కళ్యాణ్ గారు నిర్మిస్తున్నారు.

‘ఎన్.టి.ఆర్’ కథానాయకుడు, మహానాయకుడు లాంటి సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న బాలయ్య బాబు, ఈ సారి తన కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరి ‘జై సింహ’ గా హిట్ ఇచ్చిన రవికుమార్ గారు ‘రూలర్’ గా హిట్ ఇస్తారో లేదో చూద్దాం. మొన్న రిలీజ్ చేసిన బాలయ్య బాబు కొత్త లుక్ అయితే నందమూరి అభిమానులకి నిజమైన పండగ అని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All