Homeటాప్ స్టోరీస్టీడీపీ కార్యకర్తని తరిమితరిమికొట్టిన బాలయ్య

టీడీపీ కార్యకర్తని తరిమితరిమికొట్టిన బాలయ్య

Balayya-babu-beats-tdp-member
నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా సింహంలా వేటాడుతున్నాడు , అయితే వేట తన ప్రత్యర్థులపై అయితే బాగుండేది కానీ తన అభిమానులపై అలాగే తెలుగుదేశం కార్యకర్తలపై కావడంతో షాక్ అవ్వడం టీడీపీ శ్రేణుల వంతు అవుతోంది . బాలయ్య వేషాల గురించి మీడియాలో పెద్ద పెద్ద హెడ్డింగ్ లతో వస్తున్నప్పటికీ బాలయ్య లో మాత్రం మార్పు రావడమే లేదు . 
 
తాజాగా మరోసారి బాలయ్య రెచ్చిపోయిన తీరుకి టీడీపీ శ్రేణులు నివ్వెరబోయారు . ప్రచార రథం పై ఉన్న బాలయ్య ఒక్కసారిగా కిందకి దిగి ఓ టీడీపీ కార్యకర్తని వెంబడించి మరీ తరిమి తరిమి కొట్టాడు దాంతో ఆ పక్కన ఉన్న వాళ్ళు భయంతో వణికిపోయారు . పోనీ ఆ టీడీపీ కార్యకర్త ఏమైనా తప్పు చేశాడా ? అదీ లేదు . అతడు వేరే పార్టీ వాడు కాదు కానీ సహనం కోల్పోతున్న బాలయ్య తన అభిమానులపై , కార్యకర్తలపై చేయి చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శల పాలౌతున్నాడు . హిందూపురం లో బాలయ్య గెలిస్తే అది రికార్డ్ అన్నమాటే ఎందుకంటే నియోజకవర్గం లో బాలయ్య కు అంతగా అనుకూలత లేదు మరి . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All