Homeటాప్ స్టోరీస్అఖండ ఓవర్సీస్ బిజినెస్..!

అఖండ ఓవర్సీస్ బిజినెస్..!

Balakrishna Akhanda Overseas Business Details
  

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా లుక్ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లో అఖండ మంచి బిజినెస్ చేస్తుండగా అఖండ ఓవర్సీస్ లో కూడా భారీ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో అఖండ సినిమాను 2 కోట్లకు కొనేసినట్టు తెలుస్తుంది.

సినిమా బ్రేక్ ఈవెన్ రావాలి అంటే అక్కడ 700కె మిలియన్ డాలర్స్ రాబట్టాల్సి ఉంటుంది. బాలకృష్ణ సినిమా ఓవర్సీస్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. సిం హా, లెజెండ్ తర్వాత బాలయ్య బాబు, బోయపాటి చేస్తున్న థర్డ్ మూవీగా అఖండ మీద భారీ అంచనాలే ఉన్నాయి.

- Advertisement -

ఇక 27న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు ఎవరు గెస్ట్ గా వస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వస్తాడని అనుకుంటే ఆయన ఫ్యామిలీతో వెకెషన్ లో ఉన్నారు. కాబట్టి తారక్ వస్తాడన్న ఆశ వదుకోవాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All