Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ బయోపిక్ రేపే ప్రారంభం

ఎన్టీఆర్ బయోపిక్ రేపే ప్రారంభం

balakrihnas ntr biopic tomorrow onwardsనటసింహం నందమూరి బాలకృష్ణ మహానటుడు ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్న చిత్ర ప్రారంభోత్సవం రేపే జరుగనుంది . తేజ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బాలయ్య తో పాటుగా సాయి కొర్రపాటి , విష్ణు ఇందూరి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు . ఎన్టీఆర్ బయోపిక్ అనగానే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి దాంతో ఆ అంచనాలను అందుకునే స్థాయిలో చిత్ర నిర్మాణం ఉండాలని భావిస్తున్నారు బాలయ్య .

ఇప్పటికే పాత్రల ఎంపిక పూర్తిచేసిన తేజ ప్రస్తుతం బయోపిక్ ని అద్భుత దృశ్య కావ్యంగా మలిచేలా ప్రయత్నాలు చేస్తున్నాడు . రేపు అశేష అభిమానులతో పాటుగా పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభం కానుంది . రేపు ప్రారంభం అయినప్పటికీ జూన్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All