Homeటాప్ స్టోరీస్చైనాలో ప్రభంజనం సృష్టిస్తున్న సల్మాన్

చైనాలో ప్రభంజనం సృష్టిస్తున్న సల్మాన్

bajrangi bhaijaan collects 281 crores in chinaభజరంగీ భాయీజాన్ సినిమాతో ఇండియాలో సంచలనం సృష్టించాడు సల్మాన్ ఖాన్ . 2015 లో విడుదలైన ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు కాగా ఇప్పుడేమో చైనా ప్రేక్షకులు సల్మాన్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు . నెల రోజుల క్రితం విడుదలైన సల్మాన్ చిత్రం అక్కడ ప్రభంజనం సృష్టిస్తోంది , వసూళ్ల వర్షం కురిపిస్తోంది . భజరంగీ భాయీజాన్ అక్కడ ” లిటిల్ లోలిట …. మంకీ గాడ్ అంకుల్ ” పేరుతో విడుదల అయ్యింది .

నాలుగు వారాల్లో 281 కోట్ల వసూళ్ల ని రాబట్టాడు సల్మాన్ . చైనా లో కూడా మన భారతీయ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది . అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రానికైతే అప్పనంగా వసూళ్ల ని కట్టబెట్టారు చైనా ప్రేక్షకులు . ఇక ఇప్పుడేమో సల్మాన్ చిత్రం ఓ ఊపు ఊపేస్తోంది . ఈ చిత్రానికి కథ అందించింది మన తెలుగువాడు అయిన విజయేంద్ర ప్రసాద్ కావడం విశేషం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All