Homeటాప్ స్టోరీస్100 మిలియన్ వ్యూస్ వచ్చినా.. రైటర్ కి క్రెడిట్ ఇవ్వలేదు

100 మిలియన్ వ్యూస్ వచ్చినా.. రైటర్ కి క్రెడిట్ ఇవ్వలేదు

100 మిలియన్ వ్యూస్ వచ్చినా.. రైటర్ కి క్రెడిట్ ఇవ్వలేదు
100 మిలియన్ వ్యూస్ వచ్చినా.. రైటర్ కి క్రెడిట్ ఇవ్వలేదు

ప్రపంచంలో ఒక పాత సామెత ఉంది. “అన్నీ ఉన్నోడు కొత్త కొత్త రోగాలు చచ్చిపోతే.. ఏమీ లేనోడు ఆకలితోనే చచ్చిపోతాడు అనీ..” వాడికి కొత్త కొత్త రోగాలు వచ్చే స్కోప్ లేదు. అలా అని చెప్పి ఆరోగ్యం ఉంది కదా.. అని, ఆనందంగా సుఖంగా బతికే అవకాశం కూడా ఉండదు. కొద్దిగా అటూ ఇటూగా సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాగే ఉంటుంది. కష్టపడి పనిచేసిన టెక్నీషియన్ కి డబ్బులు ఇస్తారో.. లేదో… తెలియదు గానీ క్రెడిట్ మాత్రం ఇస్తారని గ్యారెంటీ లేదు. పని చేసిన వాడికి క్రెడిట్  ఇవ్వకుండా ఏమీ చేయలేని తెచ్చి తెచ్చి జనాల ముందు హైప్ చెయ్యడం దశాబ్దాల నుంచి ఉన్న వ్యవహారమే.

ప్రస్తుతం బాలీవుడ్లో అలాంటి ట్రెండే మళ్లీ రిపీట్ అయింది. “యో యో హనీ సింగ్” తర్వాత ఆ స్థాయిలో బాగా ఫేమస్ అయిన ఆల్బమ్ సింగర్ బాద్షా.. ఇటీవలే హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశాడు. “లాల్ గెందా పూల్” అని పిలవబడే పాత బెంగాలీ పాటని రీమిక్స్ చేశారు.

- Advertisement -

ఒకసారి యూట్యూబ్ లో 110 మిలియన్ స్పై దాటిన ఈ పాటని చూస్తే కేవలం డబల్ మీనింగ్ లిరిక్స్, అందులో నటించిన హీరోయిన్ మరియు మిగతా ఆడవాళ్ళ అందచందాలు స్కిన్ షో వల్ల మాత్రమే పాట హిట్ కాలేదు. ఆ పాటకి మూలం అయిన ఒక బెంగాలీ జానపదం కొన్ని దశాబ్దాలుగా యావత్ ఉత్తర భారతదేశ గ్రామీణ ప్రజల నోళ్లలో నానే పాట అది. ఆ పాటని రచించిన రచయిత పేరు “రతన్ కహార్.”

ప్రస్తుతం బాద్షా రీమిక్స్ చేసిన ఈ పాట డిస్క్రిప్షన్ లో మరీ దారుణంగా హీరోయిన్ పర్సనల్ స్టాఫ్ పేరుతో సహా వేశారు కానీ… అసలు గీత రచయిత పేరు ప్రస్తావించలేదు.పాట మొదట్లో కృతజ్ఞతాపూర్వకంగా థాంక్స్ కార్డు కూడా సభ్యతా పూర్వకంగా ఆశించడం అత్యాశే అవుతుంది. డిస్క్రిప్షన్ లో ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ దగ్గర బెంగాలీ ఫోక్ అని వేశారు.

దీని భావ దారిద్ర్యం అనుకోవాలా.?, అహంకారం అనుకోవాలా.? లేకపోతే పచ్చిగా ఒకళ్ళని అణిచివేసి బతికే పెత్తందారీ వ్యవస్థ.. అనుకోవాలా…?  పాట కోసం పెట్టిన ఖర్చు లోనూ అదే పాట వచ్చిన రాబడి లోనూ ఒక్క రూపాయి కూడా ఆ రచయిత కు ఇవ్వరు కదా..!  కనీసం కృతజ్ఞతాపూర్వకంగా అయినా అతని పేరు వేయడం అనేది మర్యాద అనిపించుకుంటుంది.

కాని సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఇలాంటి రోజుల్లో ఎవరు ఏది దోచినా.. దాచినా అది ఎంతో కాలం దాగదు. ఒకపక్క పాటను, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అందాలనూ మెచ్చుకుంటూనే మరొక పక్క రతన్ కహార్ కు  ఎందుకు క్రెడిట్ ఇవ్వలేదు.? అని నెటిజన్స్ బూతులు తిడుతున్నారు. పక్కన వారి జ్ఞానాన్ని కళను దోపిడీ చేసి బతికే ఈ పరాన్న జీవుల కు భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుందాం.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All