Homeటాప్ స్టోరీస్ఈ శిష్యుడైనా హిట్ కొడతాడా

ఈ శిష్యుడైనా హిట్ కొడతాడా

Bad sentiment for SS Rajamouliఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి . ఇప్పటి వరకు జక్కన్న దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి అయితే జక్కన్న శిష్యులు ఒక్కరు కూడా ఇంతవరకు హిట్ కొట్టలేక పోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు అరడజను మంది దర్శకులు అయ్యారు రాజమౌళి శిష్యులు వాళ్లలో ఒక్కరు కూడా కనీసం యావరేజ్ సినిమా చేయలేకపోయారు. జక్కన్న శిష్యులు చేసిన సినిమాలన్నీ ఘోర పరాజయం పొందినవే ! తాజాగా జక్కన్న మరో శిష్యుడు అశ్విన్ గంగరాజు ఆకాశవాణి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఆకాశవాణి చిత్రం విశేషం ఏంటంటే …… ఈ సినిమాని రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తుండటం. ఎస్ ఎస్ కార్తికేయ ఇప్పటి వరకు జక్కన్న కు చేదోడు వాదోడు గా ఉన్నాడు . కానీ ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు. ఒకవైపు శిష్యుడు దర్శకత్వం వహిస్తున్న సినిమా , మరోవైపు తనయుడు నిర్మిస్తున్న చిత్రం కావడంతో తప్పకుండా హిట్ కొట్టాల్సిన సినిమా ఇది. మరి ఈ శిష్యుడైనా హిట్ కొట్టి జక్కన్న పేరు నిలబెడతాడా ? లేక మిగతా శిష్యుల లాగే చేస్తాడా ? అన్నది చూడాలి.

- Advertisement -

English Title: Bad sentiment for SS Rajamouli

SS Karthikeya to produce Aakashavani

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All