Homeటాప్ స్టోరీస్మల్టీప్లెక్స్ వాళ్లకు గడ్డురోజులు

మల్టీప్లెక్స్ వాళ్లకు గడ్డురోజులు

Bad News for Multiplexes in Maharashtraమల్టీప్లెక్స్ థియేటర్ వాళ్లకు గడ్డు రోజులు దాపురించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో మల్టీప్లెక్స్ థియేటర్ వాళ్ళు షాక్ అవుతున్నారు. ఇంతకీ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా……. మల్టీప్లెక్స్ లలో ఇక తినుబండారాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం సినిమా చూస్తూ ఏ ఏ ఆహార పదార్థాలు తినాలని అనుకుంటారో వాటిని హాయిగా ఇంటి నుండే తీసుకెళ్ళొచ్చు. మల్టీప్లెక్స్ లలో ఆహార పదార్థాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి దాంతో ఆ బాధ భరించలేక మహారాష్ట్ర హై కోర్టు ని ఆశ్రయించారు వినియోగదారులు. మల్టీప్లెక్స్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హై కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీచేసింది. త్వరలోనే మల్టీప్లెక్స్ థియేటర్ లపై విధి విధానాలు రూపొందిస్తామని , ఆ తర్వాత మల్టీప్లెక్స్ లలో ఆహార పదార్థాలు ఇంటి నుండి తీసుకొని వెళ్లొచ్చని ఒకవేళ థియేటర్ సిబ్బంది ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్ణయంతో మల్టీప్లెక్స్ నిర్వాహకులు షాక్ అవుతున్నారు.

- Advertisement -

English Title: Bad News for Multiplexes in Maharashtra

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All