Homeటాప్ స్టోరీస్కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బాబూమోహన్

కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బాబూమోహన్

Babumohan fires on kcrఆందోల్ తాజా మాజీ ఎం ఎల్ ఎ , సినీ నటుడు బాబూమోహన్ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై నిప్పులు చెరిగాడు . నన్ను తక్కువగా అంచనా వేసి అవమానిన్చావ్ కదా ! నేనంటే ఏంటో ఎన్నికల్లో చూపిస్తా ! ఈరోజు మాములుగానే విమర్శిస్తున్నాను కానీ ఈనెల 10 నుండి అసలైన తిట్ల దండకం అంటే ఏమిటో చూపిస్తా అంటూ కెసిఆర్ కు సవాల్ విసిరాడు బాబూమోహన్ . ఫాం హౌజ్ కు మాత్రమే పరిమితమై పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క కెసిఆర్ మాత్రమేనని ఇలాంటి చవకబారు సిఎం ని నేనింతవరకు ఎక్కడా చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేసాడు బాబూమోహన్ .

తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బాబూమోహన్ రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు . ఇక గత ఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఆందోల్ నుండి మళ్ళీ ఎన్నికయ్యాడు . అయితే దళితుల కోటాలోనైనా మంత్రి పదవి వస్తుందేమో అని ఆశించి భంగపడగా తాజాగా బాబూమోహన్ కు టికెట్ కూడా నిరాకరించడంతో కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీలో చేరాడు . ఇక ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన బాబూమోహన్ కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా ఈనెల 10 నుండి విమర్శలకు మరింతగా పదును పెట్టి తిట్ల దండకం అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని అంటున్నాడు .

- Advertisement -

English Title: Babumohan fires on kcr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All