Homeటాప్ స్టోరీస్సక్సెస్ పై ధీమాగా ఉన్న అశ్వమేథం డైరెక్టర్ నితిన్ 

సక్సెస్ పై ధీమాగా ఉన్న అశ్వమేథం డైరెక్టర్ నితిన్ 

Ashwamedham Director Nithin. G Confident on Success
Ashwamedham Director Nithin. G Confident on Success

సక్సెస్ పై ధీమాగా ఉన్న అశ్వమేథం డైరెక్టర్ నితిన్

ధృవ్ కరుణాకర్ – శివాంగి జంటగా నితిన్ . జి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అశ్వమేథం . స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు దర్శకుడు నితిన్ . జి . అశ్వమేథం స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ ఎంటర్ టైన్ మెంట్ లో కానీ మ్యూజికల్ గా కూడా ఆకట్టుకునే చిత్రమని ధీమా వ్యక్తం చేస్తున్నాడు .

- Advertisement -

మరాఠీ భాషలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నితిన్ కు తెలుగులో ఇది మొదటి సినిమా . తెలుగు బాష రాకపోయినా తెలుగు పై మక్కువతో ఎంతో ఇష్టపడి , కస్టపడి అశ్వమేథం చిత్రాన్ని చేసానని అంటున్నాడు . తెలుగు సినిమాలు రెగ్యులర్ గా అన్నీ చూస్తానని , అయితే జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రవితేజ లాంటి హీరోలకు ఎక్కువగా ఫాలోయింగ్ ఉందని , బాహుబలి నుండి ప్రభాస్ మేనియా మొదలయిందని ఇక అశ్వమేథం విషయానికి వస్తే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఎవరి పాత్రల్లో వాళ్ళు మెప్పించారని స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన అశ్వమేథం తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు దర్శకులు నితిన్ . జి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All