`నాటకం` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అషీమా నర్వాల్. హర్యానాలో పుట్టిన ఈ చిన్నది ఆస్ట్రేలియాలో సెటిలైంది. ఇప్పడు అక్కడే సిటిజన్‌షిప్ పొందింది. కానీ సినిమాలపై వున్న మక్కువతో ఇండియా బాటపట్టింది. ప్రస్తుతం తమిళ చిత్రం `రాజభీమ` చిత్రంలో నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో వున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది.
ప్రస్తుతం తెలుగులో మూవీ చేస్తున్న ఆషిమా నర్వాల్ ఇందు కోసం గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే వుంటోంది. సోషల్ మీడియా ఇన్ స్టా వేదిక గా హాట్ హాట్ ఫొటోలతో హీటెక్కిస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా `షీమా పోస్ట్ చేసిన వీడియో క్రేజీగా వైరల్ అవుతోంది. ఇందులో అషీమా చేసిన చిలిపి పనిని అందరినీ ఆకట్టుకుంటోంది.
- Advertisement -
సిగరెట్ కాలుస్తూ నందమూరి బాలకృష్ణ నటించిన `శ్రీమన్నారాయణ` చిత్రంలో `డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ..ట్రబుల్ ట్రబుల్స్ యూ.. ఐయామ్ నాట్ ద ట్రబుల్ .. ఐయామ్ ద ట్రూత్.. డైలాగ్‌ని స్టైల్‌గా చెబుతూ సిగరెట్ దమ్ము లాగించేసింది. ఆస్ట్రేలియాలో సెటిలైన అమ్మాయి కాబట్టి సిగరెట్ అలవాటున్నట్టుగా స్టైల్‌గా అషీమా దమ్ములాగడం గమనార్హం.