Homeటాప్ స్టోరీస్భర్త పై కేసు పెట్టిన బాలీవుడ్ నటి

భర్త పై కేసు పెట్టిన బాలీవుడ్ నటి

Arzoo govitrikar file case against husbandబాలీవుడ్ భామ అర్జూ గోవిత్రికర్ తన భర్త ఫై కేసు పెట్టింది . మద్యం తాగొచ్చి ప్రతీ రోజు నన్ను కొడుతున్నాడని , బాత్ రూంలో పడేసి దారుణంగా కొట్టాడని ఫిర్యాదు చేయడమే కాకుండా ఇంట్లోని సీసీ ఫుటేజీ ని సాక్ష్యంగా ఇచ్చింది దాంతో షాక్ అవ్వడం ఆమె భర్త వంతయ్యింది . అర్జూ అనే బాలీవుడ్ నటి వ్యాపారవేత్త అయిన సిద్దార్థ్ సబర్వాల్ ని 2010 లో పెళ్లి చేసుకుంది , వాళ్లకు అయిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు .

 

- Advertisement -

అయితే ఏడేళ్ల పాటు వీళ్ళ కాపురం బాగానే సాగింది కానీ గత ఏడాది కాలంగా ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయట దాంతో గొడవలు మొదలయ్యాయి . అయితే నేను నిజంగా కొట్టలేదని ఓ క్రైమ్ షోలో భాగంగా రిహార్సల్స్ కోసం కొట్టమంటే కొట్టానని కానీ దాన్ని ఇలా ఉపయోగించుకుందని ఆరోపిస్తున్నాడు అర్జూ భర్త సిద్దార్థ్ సబర్వాల్ .

English Title: Arzoo govitrikar file case against husband

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All