Homeటాప్ స్టోరీస్ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సయేశా

ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సయేశా

ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సయేశా
ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సయేశా

తమిళ స్టార్ హీరో ఆర్యకు డబల్ ధమాకా దక్కినట్లు అయింది. రీసెంట్ గా ఆర్య నటించిన సర్పట్ట పరంబరాయ్ చిత్రానికి విశేష స్పందన దక్కింది. ముఖ్యంగా ఆర్య పెర్ఫార్మన్స్ కు అన్ని వర్గాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెల్సిందే.

దీనికి తోడు ఆర్యకు మరో హ్యాపీ న్యూస్ వచ్చింది. ఆర్య భార్య సయేశా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆర్య, సయేశా 2019లో పెళ్లి చేసుకున్నారు. ఈ డెలివరీ న్యూస్ ను ఆర్య సన్నిహితుడు విశాల్ ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేసాడు.

- Advertisement -

“ఈ వార్త చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు షూట్ మధ్యలో ఉన్నాం కానీ ఎమోషన్స్ ను ఆపలేకపోతున్నా. నేను మావయ్య అయినందుకు ఆనందంగా ఉంది. వాళ్లకు ఎప్పుడూ మంచే జరగాలి” అని ట్వీట్ చేసాడు.

ఆర్య, విశాల్ ఎనిమీ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈరోజు ఈ చిత్ర టీజర్ కూడా విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All