Homeటాప్ స్టోరీస్అర్జున్ సురవరం టీజర్ ఎలా ఉందంటే

అర్జున్ సురవరం టీజర్ ఎలా ఉందంటే

Arjun Suravaram teaser talk నిఖిల్ నటించిన అర్జున్ సురవరం టీజర్ ని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేసారు . తమిళ్ లో కనితన్ గా వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది దాంతో ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేసారు . ఇక తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన టి . సంతోష్ తెలుగులో కూడా దర్శకత్వం చేపట్టాడు . ఇక శివరాత్రి సందర్బంగా టీజర్ ని రిలీజ్ చేసారు ఆ చిత్ర బృందం .

 

- Advertisement -

టీజర్ చూస్తుంటే తప్పకుండా సినిమా హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది . నిఖిల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు , ఇక జర్నలిజం లో రేటింగ్ కోసం ఎలా మార్పులు వచ్చాయి , దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి . అసలైన జర్నలిజం ఏంటి అన్నదే ఈ అర్జున్ సురవరం కథలా ఉంది . మొత్తానికి నిఖిల్ ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నాడు . గత కొంత కాలంగా నిఖిల్ కు సరైన హిట్ లేదు కానీ ఆ లోటుని అర్జున్ సురవరం తీర్చేలా ఉంది . నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటించిన ఈ చిత్రాన్ని ఈనెలాఖరున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Arjun Suravaram teaser talk

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All