Homeటాప్ స్టోరీస్మీడియాపై మండిప‌డుతున్న అర్బాజ్‌ఖాన్‌!

మీడియాపై మండిప‌డుతున్న అర్బాజ్‌ఖాన్‌!

Arbaazkhan agrees dating with giorgia
Arbaazkhan agrees dating with giorgia

బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్భాజ్‌ఖాన్ త‌న భార్య మ‌లైకా అరోరాతో విడిపోయిన విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ బేధాలు రావ‌డంతో 2017లో విడాక‌లు తీసుకున్నారు. అయితే అర్భాజ్‌ఖాన్ మాత్రం మ‌లైకాను విడాకులు తీసుకోవ‌ద్ది ఎంత వారించినా ఫలితం లేకుండా పోయింది. విడిపోయిన వెంట‌నే అర్జున్ క‌పూర్‌తో డేటింగ్‌లో వున్నాన‌ని మ‌లైకా ఓపెన్‌గా ప్ర‌క‌టించేసింది. అర్భాజ్‌ఖాన్ ఇటాలియ‌న్ మోడ‌ల్ జార్జియా ఆండ్రియానితో డేటింగ్ చేయ‌డం మొద‌లుపెట్టాడు.

అర్భాజ్‌ఖాన్‌, మ‌లైకా విడిపోయినా త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. వీరు మ‌ళ్లీ పెళ్లి చేసుకోనున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. దీనిపై అర్భాజ్‌ఖాన్ ని క‌లిసిన మీడియా అత‌నిపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అర్భాజ్ మీడియాపై చిందులు తొక్కడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. `నేను మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీకు ఎవ‌రు చెప్పారు?, మా డ్రైవ‌రా? మ‌ఆ అమ్మ చెప్పిందా? లేక మా అన్న‌య్య చెప్పాడా? నా గాళ్ ఫ్రెండ్ చెప్పిందా? ` అంటూ మీడియాపై ఎదురుదాడికి దిగారు. నేను వివాహం చేసుకుంటే డోలు కొట్టి మ‌రీ చెబుతా` అని ఫైర‌య్యారు.

- Advertisement -

జార్జియా గురించి మాట్లాడుతూ ` ఇద్ద‌రం డేటింగ్‌లో వున్నాం. ఒక‌రంటే ఒక‌రికి ఇష్టం. అలా అని ఇప్పుడే పెళ్లి చేసుకోవాల‌నే ఆలోచ‌న మాకు లేదు. జార్జియా సినిమాల్లో న‌టిస్తుంది. త్వ‌ర‌లో నేను నిర్మించ‌బోయే చిత్రంలోని ఓ పాట‌లో న‌టించ‌నుంది` అని క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All