
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ , ఆచార్య మూవీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా , ఆచార్య మూవీ ఏప్రిల్ 29 న విడుదల కాబోతుంది. ప్రస్తుతం చరణ్ ..శంకర్ డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
కాగా ఈ మూవీ లో ధృవ ఫేమ్ అరవింద్ స్వామి విలన్ గా కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చరణ్ నటించిన ధృవ మూవీ లో పవర్ ఫుల్ విలన్ గా అరవింద్ స్వామి కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి చరణ్ కు విలన్ గా కనిపించబోతున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఈ మూవీ లో చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా..శ్రీకాంత్ , అంజలి , సునీల్ తదితరులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.