Homeటాప్ స్టోరీస్దుమ్ము దులిపేస్తున్న పెప్సీ ఆంటీ..!

దుమ్ము దులిపేస్తున్న పెప్సీ ఆంటీ..!

దుమ్ము దులిపేస్తున్న పెప్సీ ఆంటీ..!
దుమ్ము దులిపేస్తున్న పెప్సీ ఆంటీ..!

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `సీటీమార్‌`. సంప‌త్‌నంది తెర‌కెక్కిస్తున్నారు. త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ‌నివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యాన‌ర్  పై శ్రీ‌నివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భూమిక‌, త‌రుణ్ అరోరా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్‌ని స్పీడెక్కించింది. ఇందులో భాగంగా మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన పాట‌లుకు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

తాజాగా అప్స‌రరాణి స్పెష‌ల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.రామ్‌ గోపాల్‌వ‌ర్మ అప్స‌రరాణిగా పేరు మార్చి మ‌ళ్లీ రంగంలోకి దింపిన ఈ  హాట్ గాళ్ ఇటీవ‌ల `క్రాక్‌` `బూమ్ బ‌ద్ద‌ల్ .. సాంగ్‌తో కుర్ర‌కారుని కిర్రెక్కించేసింది. తాజాగా రిలీజ్ చేసిన `నా పేరే పెప్సీ ఆంటీ..` లిరిక‌ల్ వీడియో యూట్యూబ్‌లో ఓ ఊపు ఊపేస్తోంది.  `నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్లికి నేనే యాంటీ..` అంటూ సాగే ఈ మాస్ పాట‌కి విపంచి సాహిత్యం అందించ‌గా బెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

- Advertisement -

పాట‌కు త‌గ్గ‌ట్టే అప్స‌ర‌రాణి మాస్ స్టెప్పుల‌తో హాట్ హాట్ అందాల‌తో అద‌ర‌గొట్టేస్తోంది. రేపు థియేట‌ర్ల‌లో మాస్ ఆడియ‌న్స్‌ని ఓ రేంజ్‌లో ఈ పాట ఊపేయ‌డం ఖాయంగా చెబుతున్నారు. మ‌హిళా క‌బ‌డ్డీ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీని ప్ర‌పంచ వ్యాప్తంగా  ఏప్రిల్ 2న థియేట‌ర్ల‌లో విడుదల చేస్తున్ప‌నారు. `హిప్పీ` ఫేమ్ దిగాంగ‌న సూర్యవ‌న్షీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All