
ఆర్ఆర్ఆర్ కు గుడ్ న్యూస్ చెప్పినట్లే చెప్పి..మరికాసేపట్లో రిలీజ్ అవుతున్నాగా పెద్ద షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. గత కొన్ని నెలలుగా యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే నందమూరి అభిమానులు , మెగా అభిమానులు సంబరాలకు సిద్ధమయ్యారు. థియేటర్స్ ను తమ అభిమాన నటుల కటౌట్స్ తో , ప్లెక్సీ లతో నింపేశారు.
ఈ తరుణంలో ఏపీలో బినిఫిట్ షోస్ కు అనుమతి లేదని థియేటర్స్ యాజమాన్యాలకు జిల్లాల కలెక్టర్ నోటీసు లు ఇవ్వడం అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. ఉదయం 6 గంటల లోపు ఎటువంటి బెనిఫిట్ షోలు వేయకూడదని కలెక్టర్లు థియేటర్ యజమానులను హెచ్చరిస్తున్నారు. చివరి నిమిషంలో ఇలా నోటీసులు ఇవ్వడం ఫై అంత విమర్శలు కురిపిస్తున్నారు.
- Advertisement -