Homeటాప్ స్టోరీస్చిత్రసీమకు గుడ్ న్యూస్ : కొత్త ధరలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

చిత్రసీమకు గుడ్ న్యూస్ : కొత్త ధరలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ap govt good news to tollywood
ap govt good news to tollywood

ఎట్టకేలకు ఏపీ సర్కార్ సినిమా టిక్కెట్ల ధరలను సవరిస్తూ కొత్త ధరలు ప్రకటించి చిత్రసీమలో కొత్త వెలుగులు నింపింది. గత కొద్దీ నెలలుగా జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 35 వల్ల చిత్రసీమ తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంది. కొత్త ధరలు ప్రకటించండి , అదనపు షోస్ కు అవకాశం ఇవ్వండి అంటూ సినీ ప్రముఖులు ప్రభుత్వం మొరపెట్టుకున్నారు. ఆఖరికి చిరంజీవి రంగంలోకి దిగి నేరుగా ఈ అంశం ఫై జగన్ తో మాట్లాడి సానుకూల వాతావరణం తీసుకొచ్చారు. ఖచ్చితంగా కొత్త ధరలను తీసుకొస్తామని మాట ఇచ్చిన జగన్..ఇప్పుడు ఆ మాట నిలుపుకున్నాడు. సోమవారం కొత్త ధరలతో కొత్త జీవో ను తీసుకొచ్చింది సంతోషం నింపారు. ఈ ప్రకటన తో రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ యూనిట్ లు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక రాష్ట్రంలో గ‌రిష్ట సినిమా టికెట్ ధ‌ర రూ. 250 గా ప్ర‌భుత్వం కేటాయించింది. అలాగే క‌నిష్టం గా ఒక సినిమా టికెట్ ధ‌ర ను రూ. 20 కు కేటాయించింది. అంతే కాదు రాష్ట్రంలో 5 షో ల‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే ఈ 5 షో ల‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు, రాత్రి 9 గంట‌లకు చిన్న సినిమాలు వేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కండీషన్ పెట్టింది.

- Advertisement -

ఇక పెంచిన టికెట్ ధరలను చూస్తే..

* మున్సిపల్ కార్పొరేషన్‌:

నాన్ ఏసీ థియేటర్లలో రూ.60, రూ.40
ఏసీ థియేటర్లలో రూ.100, రూ.70
స్పెషల్ థియేటర్లలో రూ.125, రూ.100
మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు రూ.150, రిక్లయినర్ సీట్లు రూ.250

* మున్సిపాలిటీ: నాన్ ఏసీ థియేటర్లలో రూ.50, రూ.30
ఏసీ థియేటర్లలో రూ.80, రూ. 60
స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.80
మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు రూ.125, రిక్లయినర్ సీట్లు రూ.250

* నగర/గ్రామ పంచాయతీ:

నాన్ ఏసీ థియేటర్లలో రూ.40, రూ.20
ఏసీ థియేటర్లలో రూ.70, రూ.50
స్పెషల్ థియేటర్లలో రూ.90, రూ.70
మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు రూ.100, రిక్లయినర్ సీట్లు రూ.250
(ఈ రేట్లకు జీఎస్టీ అదనం)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All