Homeటాప్ స్టోరీస్ఆచార్య కు గుడ్ న్యూస్ తెలిపిన జగన్ సర్కార్

ఆచార్య కు గుడ్ న్యూస్ తెలిపిన జగన్ సర్కార్

acharya censor report
acharya censor report

ఏపీ సర్కార్ ఆచార్య చిత్రానికి గుడ్ న్యూస్ తెలిపింది. 100 కోట్లు దాటినా బడ్జెట్ చిత్రాలకు టికెట్స్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చిన జగన్..తాజాగా ఆచార్య చిత్రానికి టికెట్స్ పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. సినిమా వ్యయం రూ. 100 కోట్లు దాటడంతో టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఏప్రిల్ 29 నుంచి పది రోజుల పాటు కొత్త ధరలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఐదో షో వేసుకునే దానిపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలో స్పష్టత ఇవ్వలేదు.

మరోపక్క తెలంగాణ సర్కార్ సైతం ఈ చిత్రానికి సంబంధించి ఐదో ఆట‌కు అనుమ‌తి మంజూరు చేస్తూ కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే ఏడు రోజుల పాటు రోజుకు 5 ఆట‌ల చొప్పున ప్ర‌ద‌ర్శ‌న‌కు అవకాశం ఇచ్చింది. సినిమా హాళ్ల‌లో ఆయా కేట‌గిరీల‌ను బ‌ట్టి టికెట్ రేట్ల‌ను కూడా పెంచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. ఏసీ కేటగిరీలో మాత్ర‌మే ఈ పెంపును ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఈ ధ‌ర‌ల‌ను రూ.30 నుంచి రూ.50కి పెంచుకేనేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ టికెట్ల పెంపును కూడా ఏడు రోజుల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తించింది. ఈ ప్రకటన తో చిత్ర యూనిట్ తో పాటు మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, ఆయ‌న కుమారుడు రాంచ‌ర‌ణ్ కలిసి న‌టించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఈ నెల 29న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేయగా ..పూజా హగ్దే హీరోయిన్ గా నటించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All