
అనుష్క శెట్టి..వెండితెరపై కనిపించి చాల కాలమే అవుతుండడం తో అభిమానులు ఎప్పుడెప్పుడు ఆమెను చూద్దామా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అనుష్క చివరిగా ‘నిశ్శబ్దం’ మూవీ చేసింది. ఈ మూవీ తర్వాత కనిపించడమే మానేసింది. ఇక సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా లేకుండా పోయింది. తాజాగా ఓ పోస్టు పెట్డంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు. తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా బుధవారం షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పింది అనుష్క.
ఏళ్లు గడుస్తున్నా..తనకు ఎంత వయసొచ్చినా..తను ఎప్పుడు మీ మీ క్యూట్ పిల్లనే.. హ్యాపీ బర్త్ డే పాపా అనే క్యాప్షన్ తో అనుష్క ఫొటో షేర్ చేసింది. అనుష్క పోస్టు చూసిన నెటిజన్లు.. అనుష్క ఫాదర్ కు బర్త్ డే విషెస్ చెప్తు్న్నారు. సదరు ఫొటోలో అనుష్క క్యూట్ ..క్యూట్ ఎక్స్ ప్రెషన్స్తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అనుష్క యంగ్ హీరో నవీన్ శెట్టి చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.